నర్సంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభించిన కేటీఆర్ 

నర్సంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభించిన కేటీఆర్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. వరంగల్ , హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చేరుకున్నారు. నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసి, శిలాఫలకాలను ప్రారంభించారు.నర్సంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభించిన కేటీఆర్ 

రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన లైబ్రరీని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి మెప్మా నూతన భవనాన్ని, రూ. 38 కోట్ల వ్యయంతో నిర్మించే మిషన్ భగీరథ పనులను ప్రారంభించారు. రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్స్ భవన సముదాయానికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, చెన్నారావుపేట మండలాలకు సంబందించినటువంటి కోటి రూపాయలతో వ్యయంతో కూడిన మండల సమైక్య భవనాలను ప్రారంభించారు.

అనంతరం నర్సంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా, ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటి ఇంటికి గ్యాస్ కనెక్సన్ ఇచ్చి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన చరిత్ర సృష్టించారని కేటీఆర్ కొనియాడారు. కార్యకర్త నుంచి సర్పంచ్, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అయి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని అన్నారు. రూ.100కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేపించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేటలో 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను మంజూరు చేసుకొని 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చామన్నారు. నర్సంపేట లో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్ది. వివిధ పంటల కోసం త్వరలో ఆహార శుద్ధి ఫ్యాక్టరీ ఇస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. మిగిలి పోయిన అభివృద్ధి పనుల కోసం త్వరలో రూ. 50 కోట్లు మంజూరు చేస్తాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.