ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న చంద్రబాబు  

ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న చంద్రబాబు

వరంగల్ టైమ్స్, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 73వ జన్మదినంను పురస్కరించుకుని ఆయన ఇంద్రకీలాద్రిని దర్శించుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజల తరపున పోరాడే శక్తి, సామర్థ్యం ఇవ్వాలని, ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు ఉండే ఇబ్బందులను తొలగించే తెలివి తేటలను ఇవ్వాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తాత్కాలిక ఇబ్బందులను తొలగించి, దీర్ఘకాలంలో తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలని కోరుకున్నానని, తప్పకుండా ఈ విషయంలో విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలవడానికి రాజీలేని పోరాటం చేసేందుకు ఆలయానికి వచ్చానని వెల్లడించారు.ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న చంద్రబాబు  చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, బొండా ఉమ, యరపతినేని, టీడీ జనార్థన్ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలోని అభిలాండం వద్ద పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మీడియా సమన్వయ కర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టారు. అలిపిరి శ్రావారి పాదాల వద్ద టీడీపీ శ్రేణులు 1,116 కొబ్బరి కాయలు కొట్టి చంద్రబాబు నాయుడుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.