పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ 

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహానగర పాలక సంస్థ , ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, సైఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ పథకాల క్రింద రూ. 27.63 కోట్లతో చేపట్టిన 6 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 157.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 14 అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు చేశారు.పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ రూ. 7 కోట్ల వ్యయంతో భద్రకాళి దేవాలయ కమాన్ నుండి జీఈడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన ఆర్4 రోడ్డును, రూ. 7 కోట్ల వ్యయంతో అలంకార్ దర్గా బ్రిడ్జ్ నుండి రోడ్ నెం.2 వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్ ఆర్3 ను , రూ.11.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్ , రూ. 1.5 కోట్ల వ్యయంతో నవీకరించబడిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలను, 36 లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మెషిన్ లను మంత్రి ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ రూ. 8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 150 కే ఎల్ డి , ఎఫ్ ఎస్ పి పి ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ. 20.50 కోట్లతో నిర్మించనున్న మహానగర పాలక సంస్థ పరిపాలనా భవనానికి, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్ కు, రూ. 2 కోట్లతో విద్యుత్ నగర్ లో నిర్మించనున్న దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి, రూ 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయుటకు, రూ. 1.50 కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధికి, రూ. 22 కోట్లతో నయిమ్ నగర్ నుండి ప్రెస్టీన్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు.

రూ. 15 కోట్లతో నాలల మీద కల్వర్టుల నిర్మాణానికి, జీఈడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు, రూ. 2.50 కోట్లతో కాజీపేట నుండి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రూ. 70 లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ లో ఏర్పాటు చేయనున్న జాతీయ జెండాకు, జీడబ్ల్యూఎంసీ ఆవరణలో రూ. 4 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు, రూ.3.10 కోట్లతో హన్మకొండలో నిర్మించనున్న తెలంగాణ హస్తకళ విక్రయశాల భవనానికి, రూ. 3.6 కోట్లతో ఎన్ పిడిసిఎల్ చే మచిలిబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు జిడబ్ల్యూ ఎంసీ కార్యాలయం వద్ద ఒకే చోట మొత్తం 14 శంకుస్థాపనలను మంత్రి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవిందర్‌ రావు, జెడ్పి చైర్మన్లు డాక్టర్ సుధీరకుమార్, గండ్ర జ్యోతి, కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, అరురి రమేష్, చల్లా ధర్మరెడ్డి, తాటికొండ రాజయ్య, రాష్ట్ర మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామ అయ్యర్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ, సిపి డాక్టర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజన్, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ పి.ప్రావీణ్య, ఉప మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, రెవిన్యూ, బల్దియా, పబ్లిక్ హెల్త్, ఎన్ పిడిసిఎల్, ఉన్నత స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ అంతకు ముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ కి చేరుకున్న మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ , ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవిందర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణి, సీపీ డా.తరుణ్ జోషి , జిల్లా పార్టీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.