గాలికి కూలిన కేటీఆర్ సభా వేదిక,టెంట్లు

గాలికి కూలిన కేటీఆర్ సభా వేదిక,టెంట్లు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన చేసిన కేటీఆర్, కొద్దిసేపట్లో హన్మకొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈక్రమంలో వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున గాలి దుమారం మొదలైంది.గాలికి కూలిన కేటీఆర్ సభా వేదిక,టెంట్లుదీంతో కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. కాగా సభా వేదిక ఇంచార్జ్ తీసుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హుటాహుటిన సభా స్థలాన్ని చేరుకుని తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు.