సీఎం జగన్​ది నియంతృత్వ పాలన : టీడీపీ

సీఎం జగన్​ది నియంతృత్వ పాలన : టీడీపీఅమరావతి : అసెంబ్లీలోకి మీడియా నియంత్రణ ఖండిస్తూ టీడీపీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సచివాలయం నుంచి అగ్నిమాపక కేంద్రం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలపై ఏడాదిన్నరగా దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాడులు ఆపి అసెంబ్లీలోకి అన్ని మీడియా ఛానళ్లను అనుమతించాలని బాబు డిమాండ్​ చేశారు. ఈసందర్భంగా టీడీపీ జాతీయ నాయకుడు లోకేష్​ చేతులకు సంకెళ్లు వేకుని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతో పాటు టీడీపీ శాసనసభపక్షనేత నిమ్మలరామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్​ది నియంతృత్వ పాలన : టీడీపీ