వికలాంగుల అభివృద్ధికి కేసీఆర్ కృషి

వికలాంగుల అభివృద్ధికి కేసీఆర్ కృషి
హైదరాబాద్: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని దివ్యాంగుల అవగాహన నడకను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వాల కన్న తెరాస ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి అన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర నుంచి రవీంద్రభారతి వరకు జరిగిన ఈ నడకలో ప్రభుత్వ సలహాదారు రమణ చారి తో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, అలా వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లి నాగేశ్వర్ రావు, ఉమర్ ఖాన్, నందా పాండే దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ భవన్​, నగరంలో జరిగిన కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్​కుమార్ అంధులకు రగ్గులను బహుకరించారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అంధిస్తున్నారని జోగినిపల్లి తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్​ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు .