ఉత్కంఠ పోరులో పంజాబ్ పై గుజరాత్ విక్టరీ
వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : టీ 20 మెగా టోర్నీలో గుజరాత్ జట్టు హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 190 రన్స్ భారీ లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ( 96 : 59 బంతుల్లో 11×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు.సాయి సుదర్శన్ ( 35), కెప్టెన్ హార్దిక్ పాండ్య ( 27) రన్స్ చేశారు. ఓపెనర్ మాథ్యూ వేడ్ (6) నిరాశ పరిచాడు. చివరిగా 2 బంతులు, 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి గుజరాత్ టైటాన్స్ ది. ఈ పరిస్థితుల్లో రాహుల్ తెవాటియా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే క్రికెట్ లో ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ లో చివరి 2 రెండు బంతుల్లో 12 పరుగులు కొట్టడం అంటే అంత ఆశామాషీ కాదు. అంతేగాకా ప్రేక్షకుల కేరింతలు, ప్రత్యర్థి జట్టు వ్యూహంలో చివరిగా వచ్చినా ఆటగాళ్లు ఆ ఉత్కంఠతను ఎదుర్కోవడం కష్టం. అలాంటి పరిస్థితిలో రాహుల్ తెవాటియా బ్యాటింగ్ కు వచ్చి రెండు బంతుల్లో ఒక బంతికి సిక్స్ కొట్టాడు. దీంతో గుజరాత్ టైటాన్ కు గెలుపుపై ఆశలు పెరిగాయి. ఇక చివరి బంతిలో మరో 6 పరుగులు అవసరం. సిక్స్ కొడితే విజయం, లేదా పరాజయం.
ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో మరో సిక్స్ కొట్టి రాహుల్ తెవాటియా అందరినీ మరింత ఆశ్చర్యానికి గురి చేసి, ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ఓడిపోతుందనుకున్న గుజరాత్ టైటాన్ జట్టును చివరి 2 బంతులకు రెండు సిక్సులు కొట్టి రాహుల్ తెవాటియా 3 బంతుల్లో 13 పరుగులు చేసి విక్టరీ అందించాడు. పంజాబ్ పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, రాహుల్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే గుజరాత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించడం గమనార్హం.