రాబోయే 3 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన 

రాబోయే 3 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్డ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాబోయే 3 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.