కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దాస్యం వార్నింగ్

వరంగల్:  కాంగ్రెస్, బీజేపీ నాయకులు జతకట్టి కేసీఆర్ పై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. సచివాలయం నిర్మాణంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రజల లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెప్తారని హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సచివాలయం పునర్ నిర్మాణానికి ముందడుగు వేసిన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం అనేది రాజకీయ లబ్ధికోసమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దాస్యం వార్నింగ్హై కోర్టు సరైన రీతిలో బుద్దిచెప్పినా కాంగ్రెస్ , బీజేపీ నాయకులు సిగ్గుమాలిన చర్యలు చేయడం విడ్డూరంగా వుందని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ కనబడుటలేదంటూ ఫిర్యాదులు చేస్తూ నిరసనలు తెల్పుతున్న కాంగ్రెస్ , బీజేపి నాయకులకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన అభివృద్ధి పనులే చెంపపెట్టుగా కనిపిస్తాయని హెచ్చరించారు. సీఎం ముఖ్యకార్యక్రమాలను చూసేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. అభివృద్ధిని ఓర్వలేకనే కేసీఆర్ పై విమర్శిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 130యేండ్ల క్రితం నిర్మితమై ప్రస్తుతం గబ్బిలాలకు నిలయంగా వున్న సెక్రటేరియట్ పునర్ నిర్మాణాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా బీజేపి , కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకుని అభివృద్ధికి అడ్డుకాకుండా వుండాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు , కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమీషన్ ఛైర్మన్ ఎన్. వెంకటేశ్వర్లు, 30వ డివిజన్ కార్పోరేటర్ బోడ డిన్నా పాల్గొన్నారు.