చిన్నారి ప్రిన్సీ కుటుంబానికి ప్రభుత్వ ఆర్ధికసాయం

వరంగల్ అర్బన్ జిల్లా: మార్చి 01వ తేదీన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డు వైడనింగ్ చేస్తుండగా గోడ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందిన చిన్నారి ప్రిన్సీ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. 43 వ డివిజన్ కొత్తూరు జెండాలో జరిగిన ఈ ఘటనపై స్పందించి, చిన్నారి ప్రిన్సీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన కేటీఆర్ రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వరంగల్ పశ్చిమ నియెజకవర్గం 43వ డివిజన్ కొత్తూరు జెండా దగ్గర నివసిస్తున్న సాంబశివరావు-ధనలక్ష్మిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల చెక్కును దాస్యం వినయ్ భాస్కర్ అందించారు. మున్ముందు కూడా సాంబశివరావు చిన్నారి ప్రిన్సీ కుటుంబానికి ప్రభుత్వ ఆర్ధికసాయంకుటుంబానికి అండగా ఉంటామని దాస్యం భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కొత్తూరు జెండా పోచమ్మ గుడి దగ్గర మొక్కలను నాటి వాటి పరిరక్షణ బాధ్యతను స్థానిక నాయకులకు తెలిపారు. మొక్కలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ ఎన్ . వెంకటేశ్వర్లు , స్థానిక కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, 30వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్నా ఇంచార్జి, ఎం.హెచ్.ఓ. నారాయణ రావు, డివిజన్ ప్రెసిడెంట్ పొన్నం చంద్ర, టిఆర్ఎస్ నాయకులు నలబోలు సతీష్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.