ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ-2 ఫరీక్ష తేదీలు ఖరారు
వరంగల్ టైమ్స్ , ఎడ్యుకేషన్ డెస్క్ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఆర్ఆర్బీ ఎన్టీపీసీ) సీబీటీ 2 పరీక్షా తేదీలు విడుదలయ్యాయి. పే లెవెల్ 4, 6 పరీక్షలను మే 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. ఈ పరీక్షా తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆర్ఆర్బీ తన అధికార వెబ్ సైట్ లో ఉంచింది.ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ-2 పే లెవెల్ 4, 6 పరీక్షా తేదీలు మాత్రమే విడుదలయ్యాయి. పేలెవెల్ 2,3,5 పరీక్షా తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ-1 పరీక్షలు 7 దశల్లో డిసెంబర్ 28, 2020 నుంచి జూలై 31 , 2021 వరకు నిర్వహించింది.
సీబీటీ-1 పరీక్షా ఫలితాలను మార్చి 30, 2022- ఏప్రిల్ 1 వరకు వెల్లడించారు. అభ్యర్థులు ఆర్ఆర్బీకి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడాలని అనధికార వార్తలను నమ్మొద్దని ఆర్ఆర్బీ కోరింది.