ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం  

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోద ముద్ర వేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం  చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. రూ.1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకంతో 5 మండలాల్లోని 103 గ్రామాలకు త్రాగు, సాగునీరు అందనున్నది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినయోగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదిలా ఉండగా, మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వివరించనున్నారు.