ఎంజీఎం ఘటనపై స్పందించిన హరీశ్ రావు
వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే పేషెంట్ కాలిని ఎలుకలు గాయపరిచిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ పేషెంట్ చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సాయంత్రం లోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.ఈ ఘటనపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు స్పందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి బెడ్ల వద్ద పడేయడం వల్లనే ఎలుకల బెడద ఎక్కువైందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.