ఎండ తీవ్రతపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్

ఎండ తీవ్రతపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై , వైద్య ఆరోగ్య శాఖ, విద్యా, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రానున్న రోజుల్లో జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆస్పత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఎండ తీవ్రతపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్

అదే విధంగా సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని తెలిపారు. పిల్లలు వేడికి రాకుండా చూడాలని అన్నారు. అదే విధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.ఎండ తీవ్రతపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్అంతకు ముందు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఆర్డిఓ ఏ. శ్రీనివాస్ కుమార్, కలెక్టర్ కార్యాలయ ఎఓ కిరణ్ ప్రకాశ్ లతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలి వేంద్రాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డీఈఓ రంగయ్య నాయుడు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రషీద్, సిపిఓ సత్యనారాయణ రెడ్డి,డిపిఓ జగదీశ్, మైనార్టీ సంక్షేమ అధికారి మేన శ్రీను, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సబిత, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.