పేలుడు పదార్థాలు స్వాధీనం

పేలుడు పదార్థాలు స్వాధీనంయాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి పట్టణం డాల్ఫిన్ హోటల్​ వద్ద జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు తరలిస్తున్న కారును గురువారం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారం మేరకు పట్టణ సీఐ సుధాకర్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. దీంతో కారులో 1792 జిలిటెన్ స్టిక్స్, 1600 డిటోనేటర్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపడుతామని సీఐ తెలిపారు.