సిద్దిపేటలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన

సిద్దిపేటలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన

సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో రూ.22 లక్షలతో కొత్తగా నిర్మించిన రైతు వేదికను సీఎం ప్రారంభించారు. అంతకుముందు దుద్దెడలో ఐటీ టవర్ కు శంకుస్థాపన చేశారు. పొన్నాల శివార్లలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్ ను ప్రారంభించారు. ఎన్సాన్ పల్లిలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.225 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో 127 రైతువేదికల్లో, 110 రైతు వేదికలు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో వున్నాయి. ఆకార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పాల్గొన్నారు.