నూతన పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపన

నూతన పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపనహైదరాబాద్: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు చదివారు. భూమాత, కూర్మ, వరహారూప, నవగ్రహ, నవరత్న భరిత శిల పూజలు నిర్వహించారు. నవ కలశ స్థాపన తర్వాత శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ పేరిట పండితులు భూమి పూజలు నిర్వహించారు. రూ. 971 కోట్ల ఖర్చుతో సెంట్రల్ విస్టా కొత్త పార్లమెంట్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. 2022, ఆగస్టు 15 నాటికి ఇది పూర్తి కానున్నది. టాటా సంస్థకు నిర్మాణ పనులను అప్పగించారు. ఇవాళ జరిగిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమానికి రతన్ టాటా హాజరయ్యారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్లో సెంట్రల్ విస్టా రూపురేఖలు ఇలా వుండనున్నాయి. ఉభయ సభల పబ్లిక్ గ్యాలరీల్లో 530 సీట్లు , 1244 మంది ఎంపీలకు అనువైన రీతిలో సీట్లను , రాజ్యసభలో 348 మంది ఎంపీలకు, లోక్ సభలో 888 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాట్లతో 64వేల 500 విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకోనుంది.