కుప్పకూలిన ఫీల్డర్..ఏం జరిగిందంటే.!

కుప్పకూలిన ఫీల్డర్..ఏం జరిగిందంటే.!

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆందోళనకర ఘటన వెలుగు చూసింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛేజింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో, ఆ జట్టు 19 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ క్రీడాకారిణి షమీలియా కానెల్ ఉన్నట్టుండి పొట్ట పట్టుకుని నెమ్మదిగా కిందకు వంగింది. ఆతర్వాత ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలిన ఫీల్డర్..ఏం జరిగిందంటే.!దీంతో షాకైన మిగతా జట్టు సభ్యులు పరుగెత్తుకుంటూ ఆమె వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత జట్టు మెడికల్ టీం వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడంతో తేరుకున్న షమీలియా, నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమెను అక్కడే అందుబాటులో ఉన్న అంబులెన్స్ లో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే మ్యచ్ తిరిగి ప్రారంభమైంది. షమీలియా ఘటన జరిగినప్పటికీ విండీస్ జట్టు మంచి పట్టుదలతో ఆడి ఉత్కంఠభరిత మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో విండీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.