సర్వమంగళ మాతగా భద్రకాళీ

సర్వమంగళ మాతగా భద్రకాళీ

వరంగల్: చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అమ్నవారి ఆరు మూర్తులలో ఇచ్ఛాశక్తిని దశమహావిద్యలలోని కాళీ సపర్యా పద్దతిననుసరించి “మాత్రా” క్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు సాయంత్రం షోడశీ క్రమాన్ని అనుసరించి “సర్వమంగళ” క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వమంగళా క్రమంలో అమ్మవారు భక్తులకు సమస్త మంగళములు , శుభములను ప్రాప్తింపజేస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.