త్వరలో శ్రీ తలకోన సిద్దేశ్వర బ్రహ్మోత్సవాలు

* వేడుకగా శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
* ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు బ్రహ్మోత్సవాలు
* గోడ పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిత్వరలో శ్రీ తలకోన సిద్దేశ్వర బ్రహ్మోత్సవాలువరంగల్ టైమ్స్, తిరుపతి : తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు నిర్వహించబోయే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ పాలక మండలి ఛైర్మెన్ రేవతి రెడ్డప్ప రెడ్డి, ప్రధాన అర్చకులు శివ ప్రసాద్ శర్మ, ఈఓ జయకుమార్ లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.