పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
వరంగల్ టైమ్స్ , న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా 128 మందిని ఎంపిక చేశారు. 128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ, గోసవీడు షేక్ హసన్ లకు పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి నర్తకి పద్మజారెడ్డి, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మ శ్రీ అవార్డులు వరించాయి. అలాగే భారత్ బయోటిక్ చైర్మన్ కృష్ణ ఎల్లా -సుచిత్ర ఎల్లా దంపతులకు, సత్యనాదేళ్ల, సుందర్ పిచాయ్ , సైరస్ పూనవాలాలకు పద్మ భూషణ్ ప్రకటించింది.అంతేగాక ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు పద్మ భూషణ్ అవార్డు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు పద్మ భూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది.