తెలంగాణ, ఏపీ నుంచి మెరిసిన పద్మాలు ఇవే..

తెలంగాణ, ఏపీ నుంచి మెరిసిన పద్మాలు ఇవే..

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని 2023-పద్మ అవార్డులతో సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రకటించిన ఈ జాబితాలో 9 మందికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్ 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రముఖులు ఉన్నారు.
*పద్మభూషణ్ గ్రహీతలు

1. చిన్నజీయర్ స్వామి – (ఆధ్మాత్మిక)
2. కమలేష్ డి పటేల్ – (ఆధ్మాత్మిక)

*పద్మశ్రీ గ్రహీతలు
1. మోదడుగు విజయ్ గుప్తా – (సైన్స్ రంగం)
2. బి.రామకృష్ణారెడ్డి – (విద్యా సాహిత్యం)
3. పసుపులేటి హనుమంతరావు – (వైద్య రంగం)

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.

1. ఎంఎం కీరవాణి – ( సంగీతం)
2. ప్రకాష్ చంద్రసూద్ – (సాహిత్యం, విద్య)
3. గణేష్ నాగప్ప – ( సైన్స్, ఇంజనీరింగ్ )
4. కోట సచ్చిదానంద శాస్త్రి – ( హరికథ )
5. అబ్బారెడ్డి నాగేశ్వరరావు – ( సైన్స్, ఇంజనీరింగ్ )
6.సంకురాత్రి చంద్రశేఖర్ – ( సామాజిక సేవ )
7. సీవీ రాజు – ( కళలు)