పద్మ అవార్డుల ప్రకటన

పద్మ అవార్డుల ప్రకటన

పద్మ అవార్డుల ప్రకటన

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలతో ప్రతీ యేడాది కేంద్రప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ రిపబ్లిక్ వేడుకలకు కూడా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 106 మందిని పద్మ శ్రీ అవార్డులు వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి అవార్డులు వచ్చాయి. కాకినాడకు చెందని సంకురాత్రి చంద్రశేఖర్, తెలంగాణ నుంచి బి.రామకృష్ణారెడ్డిలను పద్మశ్రీ అవార్డులను వరించాయి.

పేద ప్రజలకు ఫ్రీ మెడికల్, ఎడ్యుకేషన్ అందిస్తూ సమాజ సేవకు కృషి చేసిన విభాగంలో చంద్రశేఖర్ కు పద్మ శ్రీ అవార్డు వచ్చింది. గిరిజన భాషను సంరక్షించినందుకు గాను తెలంగాణ నుంచి రామకృష్ణారెడ్డిని పద్మశ్రీ వరించింది.

*పద్మ అవార్డు గ్రహీతల పలువురి జాబితా..
దిలీప్ కుమార్ ( పశ్చిమ బెంగాల్ )-పద్మ విభూషణ్

*పద్మశ్రీ గ్రహీతలు..
1. సామాజిక సేవ-ఔషధ రంగం
సంకురాత్రి చంద్రశేఖర్ (ఆంధ్రప్రదేశ్ )-అఫ్రడబుల్ హెల్త్ కేర్
రతన్ చంద్రాకర్ (అండమాన్ నికోబార్ )
మునీశ్వర్ చందర్ దావర్ ( మధ్యప్రదేశ్ )
హీరాబాయి లోబి ( గుజరాత్) -గిరిజన సామాజిక సేవ
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ)-సామాజిక సేవ
వడివేల్ గోపాల్ మరియు మసి సదాయ్యన్ ( తమిళనాడు)- జంతు సంక్షేమం
రాంకుయివాంఘ్బేన్యుమె (అస్సాం)- సాంస్కృతిక సామాజిక సేవ

*సాహిత్యం-విద్య
జనుమ్ సింగరాయ్ ( జార్ఖండ్)
ధనీరామ్ టోటో ( పశ్చిమ బెంగాల్ )
బి.రామకృష్ణారెడ్డి (తెలంగాణ)

*అగ్రికల్చర్
తుల రామ్ ఉప్రెటి ( సిక్కిం)
నెక్రమ్ శర్మ ( హిమాచల్ ప్రదేశ్ )

*కళలు
రాణి మచ్చయ్య ( కర్ణాటక) -జానపద నాట్యం
దోమర్ సింగ్ కున్వార్ ( ఛత్తీస్ గఢ్)- నాట్యం
కేసీ రున్రెంసంగి ( మిజోరం)- గానం
అజయ్ కుమార్ మాండవి (ఛత్తీస్ గఢ్ )- చెక్క కళాఖండాలు

*చిత్రకళలు
పరేశ్ రాథ్వా (గుజరాత్)
పరశురాం కొమాజి ఖునె ( మహారాష్ట్ర )- నాటక రంగం
భానుబాయ్ చైతరా ( గుజరాత్ )
కపిల్ దేవ్ ప్రసాద్ (బీహార్ )- వస్త్రాలంకరణ
గులాం మహమ్మద్ జాజ్ ( జమ్మూకశ్మీర్)- క్రాప్ట్స్

*జానపద సంగీతం
రిసింగబోర్ కుర్కలాంగ్ ( మేఘాలయ)
మంగళ కాంతి రాయ్ ( పశ్చిమ బెంగాల్ )
మోవా సుబంగ్ ( నాగాలాండ్ )
మునివెంకటప్ప ( కర్ణాటక )