‘సినీవొల్యూషన్ అవార్డు 2023’ విన్నర్స్

‘సినీవొల్యూషన్ అవార్డు 2023’ విన్నర్స్

'సినీవొల్యూషన్ అవార్డు 2023' విన్నర్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ హైదరాబాద్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం వారి ద్వారా ‘సినీవొల్యూషన్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2023’ పొందిన సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు, యవతకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం భావన్స్ వివేకానంద కాలేజీ, సైనిక్ పురి యాజమాన్యం మరియు అధ్యాపకులు అభినందించారు.

చదువుకొనసాగిస్తూనే నేటి సమాజంలో కునారిల్లుతున్న సామాజిక రుగ్మతలైన ట్రాన్స్ జెండర్స్ పట్ల సంపూర్ణంగా అధ్యయనం చేస్తూ డాక్యుమెంటరీ రూపొందించిన కుమారి ఎం.బి. బాల హర్షితా యాదవ్ మరియు బిట్ల శివాని, సునీల్ బిషోయ్, సిద్దార్థ్ , అధ్యాపకులు సాయిక్రిష్ణ, శివ త్రిశూల్ టీంలు ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.

ప్రముఖ తెలంగాణా ఉద్యమ నాయకులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు యం.బి.క్రిష్ణ యాదవ్ సామాజిక రుగ్మతలను రూపొందించేందుకు కృషి చేస్తున్న టీం విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు.