తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీలు  

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. 50 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అనధికార సమాచారం మేరకు బదిలీల్లో కరీంనగర్, రామగుండం సీపీలతోపాటు నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేసినట్లు సమాచారం. బదిలీల్లో భాగంగా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు సైతం పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం.

ట్రాన్స్ ఫర్ అయిన వారిలో ఎస్పీ స్థాయి నుంచి ఐజీ స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రామగుండం సీపీగా సుబ్బారాయుడు బదిలీ అయినట్లు సమాచారం. మల్కాజిగిరి డీసీపీగా జానకి దరావత్, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ బదిలీ అయినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.