‘ఆర్ఆర్ఆర్’ కు మరో 4 అంతర్జాతీయ అవార్డులు

‘ఆర్ఆర్ఆర్’ కు మరో 4 అంతర్జాతీయ అవార్డులు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అవార్డుల పంట కురిపిస్తుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 4 కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 4 అవార్డులు అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు హెచ్ సీ ఏ అవార్డులు వరించాయి.'ఆర్ఆర్ఆర్' కు మరో 4 అంతర్జాతీయ అవార్డులుకీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక రాజమౌళి, కీరవాణి, రాంచరణ్ ఈ అవార్డులను అందకున్నారు. కాగా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హెచ్ సీ ఏ అవార్డుల కోసం నామినేట్ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ సినిమా అవార్డులు గెలుచుకోవడం గమనార్హం.

త్వరలో ఈ సాంగ్ కు ఆస్కార్ వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డు కూడా రావడం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అయితే ముఖ్యంగా నాటు నాటు సాంగ్ కోసం జూ.ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులు భారతీయులతో పాటు విదేశీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాటకు పలు అవార్డులు వరించాయి. ముందుగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. అదే ఊపుతో ఆస్కార్ కోసం ఫైనల్ నామినేషన్స్ కు ఎంపికైంది.