కేసీఆర్ చొరవతో సహకార సంఘాలు అభివృద్ధి : దాస్యం

కేసీఆర్ చొరవతో సహకార సంఘాలు అభివృద్ధి : దాస్యం

కేసీఆర్ చొరవతో సహకార సంఘాలు అభివృద్ధి : దాస్యంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఒక్కరికోసం అందరం, అందరి కోసం ఒక్కరు అనే స్ఫూర్తితో సహకార సంఘాలు అన్నీ ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని ల్యాండ్ మార్క్ బ్యాంక్వెట్ హాల్లో కాకతీయ కోపరేటివ్ శిక్షణ సెంటర్ వారు జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని చీఫ్ విప్ అన్నారు. చారిత్రాత్మకమైన నగరంలో డీసీసీబీ బ్యాంక్, కల్పలత సూపర్ బజార్ మరియు త్రిచక్ర సహకార సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సెమినార్లు మరెన్నో నిర్వహించాలని ఆయన కోరారు. సహకార సంఘాలను బలోపితం చేయడానికి తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.