ఏసీబీ వలలో గర్ల్స్ హై స్కూల్ హెచ్ ఎం

ఏసీబీ వలలో గర్ల్స్ హై స్కూల్ హెచ్ ఎం

ఏసీబీ వలలో గర్ల్స్ హై స్కూల్ హెచ్ ఎంవరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా మధిర గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.శ్రీలత ఏసీబీ వలలో చిక్కింది.మన ఊరు -మన బడిలో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు రూ.500000 సదరు కాంట్రాక్టర్ ను డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ.25వేలు ఈ రోజు లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించారు. ఇంకేముంది లంచం తీసుకుంటున్న హెచ్ఎం శ్రీలత ఏసీబీ అధికారులకు చిక్కిపోయింది.

మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.