పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన కేసీఆర్

పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన కేసీఆర్హైదరాబాద్ : జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ప్రతీ యేటా భారత ప్రభుత్వం అందించే “పద్మ” అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ అవార్డ్ ను సంయుక్తంగా దక్కించుకున్న కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల దంపతులకు, ఆర్ట్స్ విభాగంలో పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజ రెడ్డి లను సీఎం కేసిఆర్ అభినందించారు.