మెడిసిన్ లో ‘గురుకులం’ విద్యార్థుల సత్తా

మెడిసిన్ లో 'గురుకులం' విద్యార్థుల సత్తావరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకుని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుకున్నారు. ఇటీవల ముగిసిన నీట్ తొలివిడత కౌన్సిలింగ్ లో ఏకంగా 190 మంది గురుకుల విద్యార్థులు మెడికల్ సీట్లను కైవసం చేసుకున్నారు. దీంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధి కృషిని ఎలుగెత్తి చాటారు. ఈ యేడాది ఏకంగా 240 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 65 మంది వివిధ రిజర్వేషన్ క్యాటగిరిల్లో ర్యాంకులను సొంతం చేసుకున్నారు.

నీట్ మొదటి విడత కౌన్సిలింగ్ ఇటీవల నిర్వహించగా అందులో 190 మంది గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారు. గడిచిన ఆరేళ్లలో మొత్తం 513 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం విశేషం. ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.