తెలంగాణలో మొదలైన ఇంటర్ పరీక్షలు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరుగనుంది. దీంతో 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు, పరుగుల మీద పరీక్షా సెంటర్లకు చేరుకున్నారు.
ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా సెంటక్లకు వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. కాగా ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.