ఫిబ్రవరి 26న సీడీసీ 10వ స్నాతకోత్సవం-2022

ఫిబ్రవరి 26న సీడీసీ 10వ స్నాతకోత్సవం-2022వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా కిషన్ పురలోని చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం (పూర్వపు చైతన్య డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి మరియు చైతన్య పి.జి. కళాశాల స్వయం ప్రతిపత్తి)10 స్నాతకోత్సవం-2022 ఈ నెల 26న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఛాన్స్ లర్ డా. సిహెచ్ వి పురుషోత్తం రెడ్డి తెలిపారు. గురువారం సీడీసీ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. విశ్వ విద్యాలయాల విరాళాల సంఘం నియమావళి ప్రకారం అన్ని నిబంధనలను సంతృప్తి పరిచిన తర్వాత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు తమ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపును 2019లో ప్రకటించిన విషయాన్ని వారు వెల్లడించారు.

అయితే 2019లో ఉత్తీర్ణులైన వారికి 2020 లో 10వ స్నాతకోత్సవం నిర్వహించాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో సకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో 10 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖా కేబినెట్ మంత్రి పురుషోత్తమ్ భోగాభాయి రూపాలా, గౌరవ అతిథిగా ఏపీ పూర్వపు పర్యాటక, పంచదార, కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరుకానున్నట్లు ఛాన్స్ లర్ డా. సిహెచ్ వి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొ.జి దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు.