మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం

మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మహిళా క్రికెటర్ లో లేడీ సచిన్ గా గుర్తింపు పొందిన భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ కమింగ్ వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. గత 23 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ స్టార్ ఎన్నో చిరస్మరణీయ సక్సెస్ లను అందించింది. 2005లో జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన మిథాలీ, అత్యుత్తమ బ్యాటర్ గా, కెప్టెన్ గా పలు రికార్డులు నెలకొల్పింది.