హెరాయిన్..ఎక్కడ దాచాడో తెలుసా ?

కడుపులో రూ.7 కోట్ల విలువైన హెరాయిన్
అది కడుపు కాదు హెరాయిన్ పుట్ట అని నెటిజన్లు కామెంట్స్

హెరాయిన్..ఎక్కడ దాచాడో తెలుసా ?

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: వీడొక్కడే సినిమాలో మాదిరి కడుపులో హెరాయిన్ క్యాప్సుళ్లను దాచి స్మగ్లింగ్ కు యత్నించిన ఉగాండా దేశీయుడిని బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో ఉగాండా దేశీయుడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేయగా అతని కడుపులో 79 హెరాయిన్ క్యాప్సుళ్లను గుర్తించారు. అతన్ని మూడు రోజులుగాఆస్పత్రిలో ఉంచి వాటిని బయటకు తీశారు. ఈ డ్రగ్స్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇది కాస్త వైరల్ కావడంతో అది కడుపు కాదు హెరాయిన్ పుట్ట అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.