క్రిస్టియన్ మిషనరీలలో ఐటీ దాడుల కలకలం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మిషనరీలలో ఐటీ దాడులు కలకం రేపాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లోని స్వచ్ఛంధ సంస్థలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, మెదక్, పటాన్ చెరు, ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ, అనుబంధ సంస్థలకు సంబంధించిన రికార్డులను ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రముఖమైన బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయమైన హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగన్ లోని కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలవికాసకు సంబంధించిన ముఖ్య కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం.