ఎన్నికల్లో జోరందుకున్న మద్యం అమ్మకాలు

ఎన్నికల్లో జోరందుకున్న మద్యం అమ్మకాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినిట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. జీహెచ్ ఎంసీ పోరులో పలు రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మద్యానికి గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో నవంబర్ 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న రూ.102 కోట్లు, 26న రూ.58 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ.176 కోట్లు, 29న రూ.108 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.ఎన్నికల్లో జోరందుకున్న మద్యం అమ్మకాలునవంబర్ 17 నుంచి 29వరకు హైదరాబాద్ లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని, ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 317, మేడ్చల్ జిల్లాలో రూ.42 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.100కోట్ల లెక్కన మొత్తం రూ.615కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. మొత్తంగా బల్దియా ఎన్నికల పుణ్యమా అని గ్రేటర్ హైదరాబాద్ లో సాధారణ రోజుల్లో మద్యం విక్రయాల కంటే 40శాతం అధికంగా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.