బల్దియా ఎన్నికలో తొలిసారి ఓటేసిన మంత్రి

బల్దియా ఎన్నికలో తొలిసారి ఓటేసిన మంత్రిహైదరాబాద్: జీ‌హెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని, హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఓటుహక్కు వున్న ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్  విజ్ఞప్తి చేశారు. బల్దియా ఎన్నికల పోలింగ్ లో నేడు ఖైరతాబాద్ సర్కిల్, సోమాజీగూడ వార్డు నంబర్ 97, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వద్ద పోలింగ్ నంబర్ 3లో మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ లో సాధారణ ఓటర్ లాగానే క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో మొదటిసారి తన ఓటును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా వుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనంతరం అక్కడి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనం సంగీతా యాదవ్ ను ఆమె అభినందించారు.