ఓటేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

ఓటేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌
హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లోని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతంరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రాలకు రావాలని సూచించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే టీమ్‌లు చురుగ్గా పని ప్రారంభించాయన్నారు.