ఓటుహక్కు వినియోగించుకున్న సినిమా స్టార్లు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. 150 డివిజన్లలో పోలింగ్ జరగనుండగా, గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు.. కోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు ఓటింగ్ జరుగనుంది. అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినిమా తారలు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.
అలాగే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి , విజయదేవరకొండ, రాజా, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, మంచులక్ష్మీ, తనికెళ్లభరణి, యంగ్ హీరో రామ్, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు క్రిష్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఆలీ, సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా ముళపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.