ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర డీజీపీ

ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర డీజీపీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధిగా భావించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహెందర్ రెడ్డి పిలుపునిచ్చరు. హైదరాబాద్ లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కుందన్ బాగ్ లోని చిన్మయ స్కూల్ లో డీజీపీ మహెందర్ రెడ్డి దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర డీజీపీప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ ఓటర్లను విన్నవించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.