మెరిసేలే.. మెరిసేలే లిరికల్ సాంగ్ విడుదల

మెరిసేలే.. మెరిసేలే లిరికల్ సాంగ్ విడుదల

వరంగల్ టైమ్స్,సినిమా డెస్క్ : ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి ఇటీవల విడుదలైన టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని మెరిసేలే.. మెరిసేలే అనే వీడియో లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ  చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక టీజర్‌లో  చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది.మెరిసేలే.. మెరిసేలే లిరికల్ సాంగ్ విడుదల

మెరిసేలే మెరిసేలే అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశాం. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సత్య యామిని ఆలపించారు. మార్క్ రాబీన్ స్వరాలు సమకూర్చారు. తప్పకుండా చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్ మాట్లాడుతూ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.

మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు

సంగీతం: మార్క్ రాబీన్,  లైన్‌ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.