ప్రీ క్రిస్మస్ వేడుకల్లో దాస్యం

ప్రీ క్రిస్మస్ వేడుకల్లో దాస్యంవరంగల్ అర్బన్ జిల్లా : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రాష్ట్రంలో అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణలో మత సామరస్యాల తేడా లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు బహుమతులు ఇస్తూ వారి వారి పండుగలు ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాడు కలిగిస్తుందని ఆయన అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో క్రిస్టియన్ సోదరులతో పాటు, టీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.