రష్యా దాడిలో 136 మంది పౌరులు మృతి

రష్యా దాడిలో 136 మంది పౌరులు మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై రష్యా దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు యూఎన్ తెల్పింది.రష్యా దాడిలో 136 మంది పౌరులు మృతికానీ ఉక్రెయిన్ వార్ లో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని యూఎన్ మానవహక్కుల హై కమీషనర్ లిజ్ త్రోసెల్ తెలిపారు. భారీ ఆర్టిల్లరీ షెల్లింగ్, వైమానిక దాడులు, పేలుళ్లతో ప్రాణనష్టం కలిగినట్లు యూఎన్ తెలిపింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 400 మంది గాయపడినట్లు కూడా యూఎన్ పేర్కొంది. కానీ ఉక్రెయిన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం, ఆ దేశంలో ఇప్పటివరకు 352 మంది పౌరులు మరణించారు. ఈ దాడుల్లో 1684 మంది గాయపడ్డారు.