హైదరాబాద్ లో దారుణం..యువతిపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో దారుణం..యువతిపై గ్యాంగ్ రేప్

వరంగల్ టైమ్స్,రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న వాట్స్ ఆప్ చాటింగ్ లో  ఓ యువతికి ఓయువకుడుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చాటింగ్ కాస్త మితిమీరడంతో యువకుడు సాజీద్.. న్యూడ్ గా చాటింగ్ చేయమని యువతి కోరాడు. సాజిద్ మాటలకు టెంప్ట్ అయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. అంతే ఇంకేముంది..అప్పటి వరకు న్యూడ్ చాటింగ్ ను ఎంజాయ్ చేసిన యువకుడు సాజీద్ ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. న్యూడ్ చాటింగ్ ను తన ఫోన్ లో రికార్డ్ చేశాడు. న్యూడ్ చాటింగ్ తో యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సాజీద్… అంతలోనే రాజేంద్రనగర్ లోని తన స్నేహితుడి గదికి రావాలని బెదిరించాడు.హైదరాబాద్ లో దారుణం..యువతిపై గ్యాంగ్ రేప్అయితే… వీడియో ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ యువతి హుటాహుటిన సాజీద్ చెప్పిన అడ్రస్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా ఆ యువతి పై అత్యాచారం చేశాడు సాజీద్. ఆ తర్వాత అతని స్నేహితులు నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువకుని మాటలకు నమ్మి మోసపోయిన బాధిత యువతి ఘటనా స్థలం నుంచే సీక్రెట్ గా 100 కు డయల్ చేసింది. యువతి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు చేరుకున్నారు. గదిలోవున్నయువతిని కాపాడి, అత్యాచారంకు పాల్పడ్డ సాజీద్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ పై రాజేంద్రనగర్ పోలీసులు రేప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.