వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ

వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ

వరంగల్ టైమ్స్, అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో 5వ నిందితుడు శివ శంకర్ రెడ్డికి కడప కోర్టు బెయిల్ నిరాకరించింది. కడపలో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగా నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది.వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణఅనారోగ్య కారణాలతో రిమ్స్ లో చికిత్స పొందుతున్నానని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషనర్ తరపున న్యాయవాది, సీబీఐ న్యాయవాది మధ్య వాదనలు జరుగగా బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ చేసిన వాదనలతో కడప కోర్టు ఏకీభవించింది. దీంతో నిందితుడికి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.