వైఎస్ సునీతకు 100కోట్ల ఆస్తి ఎక్కడిది?

వైఎస్ సునీతకు 100కోట్ల ఆస్తి ఎక్కడిది?

వైఎస్ సునీతకు 100కోట్ల ఆస్తి ఎక్కడిది?వరంగల్ టైమ్స్, అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ కోణంలోనే వివేకా హత్య జరగలేదని, దాని వెనుక ఆర్థికపరమైన, కుటుంబ ఆస్తి తగాదాలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. వైఎస్ వివేకానందరెడ్డికి చెందిన వందల కోట్ల విలువ చేసే 90ఎకరాల భూమిని తాజాగా ఆయన కూతురు వైఎస్ సునీత పేరుమీదకు బదిలీ కావడంతో ఈ వ్యవహారంలో పెద్ద తతంగమే నడిచిందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. సీబీఐ కేవలం ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని ఇవి బయటపడ్డాక అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.

ఇటీవలే వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్ సైతం సీబీఐ ముందుకొచ్చి కీలక వాంగ్మూలం ఇచ్చారు. చివరి రోజుల్లో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారని, అందుకే ల్యాండ్ షటిల్మెంట్లు చేసేవారని సమాచారం ఇచ్చింది. అంటే ఈ లెక్కన ఆయన ఆస్తులపై కుటుంబసభ్యులు ఆంక్షలు విధించారని,ఆయన పవర్ ఆఫ్ అటార్నీ నిలుపుదల చేసి ఆర్థిక ఇబ్బందులు సృష్టించారని, ఆయన ఆస్తులు రాసియ్యకపోవడంతోనే ఇలా చేశారని షమీమ్ స్టేట్ మెంత్ తో రుజువైంది. తాజాగా వివేకానందరెడ్డి ఆస్తులు ఈ సంవత్సరం జనవరిలో ఆయన కుమార్తె సునీతకు ట్రాన్స్ ఫర్ అయినట్టు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా బయటపడడంతో ఈ నిజం వెలుగుచూసింది. పులివెందులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు బంగారంతో సమానం.కోట్ల విలువ చేస్తాయి. వైఎస్ వివేకా పేరిట ఉన్న భూములు వైఎస్ వివేకాతో పాటు కొన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట బదిలీ అయ్యాయి. మెజార్టీ సునీతకే మార్చబడ్డాయి.

2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. పులివెందుల మునిసిపాలిటీ రంగాపురం నందు 48.24ఎకరాలు. ఇక్కడ ఎకరా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకుపై మాటే. సింహాద్రిపురం మండలం రావులకొలనులో 21.49ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.15లక్షల పైమాటే. అదే మండలంలోని నిడివెల్లలో 10.63 ఎకరాలు. ఇక్కడ ధర రూ.20 లక్షలు. తెలికి గ్రామంలో 9.47ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి రూ.15 లక్షలు. ఇలా మొత్తం 89.83 ఎకరాల భూమి వివేకా భార్య, కుమార్తెల పేరిట ఈ ఏడాది జనవరిలోనే బదలాయించినట్టు తెలుస్తోంది. ఇవి మార్కెట్ రేట్స్ మాత్రమే. ఇంకా బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయిలు ఉంటుంది. మరోవైపు వివేకా తన ఆస్తిపాస్తులను ఏనాడో కుమార్తె సునీతకు రాసిచ్చారని వైఎస్ షర్మిల సహా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన షర్మిళ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.వివేకా ఆస్తి కోసం అయితే ఈ హత్య జరగలేదని షర్మిల స్పష్టం చేశారు.ఆస్తులన్నీ ఆయన కూతురు సునీత పేరు మీద ఉన్నాయని చెప్పారు.

కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. ఆస్తుల కోసమే వివేకాను సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి హత్య చేయించి ఉంటారన్న ప్రశ్నకు వివేకా ఆస్తుల బదలాయింపు బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. హత్య కేవలం రాజకీయ కోణంలో జరిగింది కాదని అన్నారు. కేవలం కుటుంబంలో ఆస్తుల వల్లనే జరిగిందని క్లియర్ కట్ గా తెలుస్తోందని ఈ రిజిస్ట్రేషన్ ఆధారాలను బట్టి పలువురు ఆరోపిస్తున్నారు.వివేకా తన ఆస్తులను బదలాయించకపోవడంతోనే ఆయన ఆస్తులను ఇప్పుడు చనిపోయాక సునీత బదలాయించుకున్నారన్న ప్రచారం మొదలైంది. అసలు సునీతకు ఈ 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోణంలో సీబీఐ విచారణ జరిపితే వివేకా హత్య గుట్టు తేలుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆస్తుల బదలాయింపు వెనుక కథను సీబీఐ తవ్వి తీసి అసలు నిజాన్ని బయటపెట్టాలని వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి అమాయకులను ఈ కేసులో ఇరికించవద్దని స్థానిక ప్రజలు కోరుతున్నారు.