నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న ముఠా అరెస్ట్

నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న ముఠా అరెస్ట్
హనుమకొండ జిల్లా : నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులను కలిగి వున్న రోడ్డు రవాణా విభాగం కార్యకలాపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలతో పాటు మొత్తం పది మంది నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేశారు.

వీరి నుండి రూ.4 లక్షల 46వేల నగదు, 3 ల్యాప్ ట్యాప్లు , 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ భీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి కమిషనరేట్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న ముఠా అరెస్ట్

అరెస్టైన వారిలో వరంగల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్లికి చెందిన ఎండి.షఫీ, కాశీబుగ్గ బాలాజీనగర్ కు చెందిన సయ్యద్ జహంగీర్, పుప్పాలుగట్టకు చెందిన పెన్నల రాజేష్, లెనిన్ నగర్ కు చెందిన వాంకిడి నిఖిల్, శివనగర్ కు చెందిన మామిడి రాజు, కాశీబుగ్గకు చెందిన నాగమల్లి శివకుమార్, హన్మకొండ శాయంపేట హంటర్ రోడ్డుకు చెందిన అల్లాడి రాజేష్, హసన్ పర్తి మండలం వంగపహాడ్ కు చెందిన గుండబోయిన శ్రీకాంత్, హన్మకొండ గుడిబండల్ కు చెందిన కేశోజు రాజ్ కుమార్, వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేటకు చెందిన బల్లాని సమన్ లు ఉన్నట్లు సీపీ వెల్లడించారు.