సీఎంఆర్ఎఫ్ ..నిరుపేదల ప్రాణాలు కాపాడుతోంది: దాస్యం

సీఎంఆర్ఎఫ్ ..నిరుపేదల ప్రాణాలు కాపాడుతోంది: దాస్యంహనుమకొండ జిల్లా : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభాగ్యులకు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందచేస్తోందని తెలిపారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 29 మంది లబ్దిదారులకు సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. రూ. 31 లక్షల 38వేల660 విలువ గల చెక్కులను బాధిత కుటుంబసభ్యులకు అందచేశారు.

సీఎం సహాయనిధి నుండి సాయం అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు. నిరుపదే కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగానే సీఎం సహాయనిధిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించేలా కృషి చేస్తున్నామని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం సీఎం అందచేస్తున్న ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.