టికెట్ల ధరలను ఎవరు నిర్ణయించాలో చెప్పిన వర్మ

టికెట్ల ధరలను ఎవరు నిర్ణయించాలో చెప్పిన వర్మ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వస్తువు ధర నిర్ణయించే అధికారం ఉత్పత్తిదారుడికి ఉన్నప్పుడు సినిమా నిర్మించే నిర్మాతకు టికెట్ ధర నిర్ణయించే హక్కు ఎందుకు లేదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరల విషయంపై ఏపీ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య రగడ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు, నిర్మాతలు, థియేటర్ల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ల ధరలను ఎవరు నిర్ణయించాలో చెప్పిన వర్మసినిమా ధరలు తగ్గించాలా? వద్దా ? అనేది నిర్మాత ఆలోచించాల్సిన విషయమని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆరోపించారు. తాజాగా ఈ అంశంపై సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ఉత్పత్తిదారునికే దాని ధరను నిర్ణయించే అధికారం ఉంటుందని, దానిని కొనాలా? వద్దా? అనేది వినియోగదారుల ఇష్టమని ఆర్జీవీ అన్నారు. సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటని ఆర్జీవీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేది నిర్మాతలే అని , సినిమా చూడాలా ? వద్దా? అన్నది ప్రేక్షకుల ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తెలిపారు. పెట్టుబడులు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం భూములను కేటాయించడం లాంటివి చేస్తుంది. ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలను అందిస్తుంది. తద్వారా ఉద్యోగితా శాతాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంది.

ఇదే అంశం థియేటర్స్ తో ఉందో లేదో నాకు తెలియదు కానీ , థియేటర్స్ లో లేకపోతే ఒక వ్యక్తి సినిమా తీస్తాడు.. తనకు నచ్చినట్లుగా ఇష్టమైన రేట్లు పెట్టుకుంటాను ఓపిక ఉన్నోడు సినిమా చూస్తాడని అన్నారు. లేనోడు మానేస్తాడు అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు కల్పించుకుంటుందని ప్రశ్నించారు. ఏ హక్కు ఉందంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై ఆర్జీవీ మండిపడ్డారు.