ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పవు

ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పవుహైదరాబాద్ : హైదరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రంగనాథ్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పకుండా నిర్వహిస్తామని మందుబాబులను హెచ్చరించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రంగనాథ్ కోరారు.